పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల ఆకలి ఎట్టకేలకు తీరనుంది. మరికొద్ది గంటల్లో ‘హరిహర వీరమల్లు’ చిత్రం వరల్డ్‌వైడ్ ప్రీమియర్స్‌కు రెడీ అయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఊహించని విధంగా భారీ సంఖ్యలో ప్రీమియర్స్ పడుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
ముఖ్యంగా యూఎస్ లో హరిహర వీరమల్లు చిత్ర ప్రీమియర్స్‌కు సాలిడ్ రెస్పాన్స్ లభిస్తోంది. అక్కడ ఇప్పటికే 20వేలకు పైగా టికెట్స్ అమ్ముడయినట్లు తెలుస్తోంది. వర్కింగ్ డే రోజున ప్రీమియర్స్ పడుతున్నా, ఈ రేంజ్‌లో టికెట్స్ అమ్ముడవడం విశేషమని చెప్పాలి.
వీరమల్లు అనే పవర్‌ఫుల్ పాత్రలో పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ ఊచకోతకు సిద్ధమవుతుండటంతో అభిమానులు ఈ సినిమాను చూసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఇక ఈ సినిమాను క్రిష్, జ్యోతికృష్ణ డైరెక్ట్ చేయగా అందాల భామ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది. బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించారు. మరి ఈ వీరమల్లు సృష్టించే విధ్వంసం ఏ రేంజ్‌లో ఉంటుందో చూడాలి.