టాలెంటెడ్ హీరో నవీన్ చంద్ర నటించిన రీసెంట్ మూవీ ‘షో టైమ్’ ఇటీవల బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయి మిక్సిడ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాను మదన్ దక్షిణామూర్తి డైరెక్ట్ చేయగా పూర్తి క్రైమ్ థ్రిల్లర్ చిత్రంగా ఈ మూవీ తెరకెక్కింది. ఇక ఈ సినిమాలో అందాల భామ కామాక్షి భాస్కర్ల హీరోయిన్‌గా నటించింది.
అయితే, ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ ఆడియన్స్‌ను థ్రిల్ చేసేందుకు సిద్ధమైంది. ఈ చిత్ర ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు సన్ నెక్స్ట్ కూడా దక్కించుకుంది. అయితే, ఇప్పుడు సన్ నెక్స్ట్‌లో ఈ సినిమాను జూలై 25న ఓటీటీ స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ప్రకటించారు. మరి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా ఎప్పుడు స్ట్రీమింగ్ చేస్తారనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.
ఇక ఈ సినిమాలో నరేష్, రాజా రవీంద్ర తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. శేఖర్ చంద్ర సంగీతం అందించిన ఈ సినిమాను కిషోర్ గరికిపాటి ప్రొడ్యూస్ చేశారు. మరి ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.