మంచు మనోజ్ కొంత కాలంగా వార్తలలో లేడు, కానీ రానున్న కొన్ని నెలలో చాలా చిత్రాల షూటింగ్లతో తను బాగా బిజీ అయిపోనున్నాడు. అతని మునుపటి చిత్రం ‘ఊ కొడతారా ఉలిక్కి పడతారా’ గత సంవత్సరం జూలైలో విడుదలైంది. ఆ తరువాత అతని భవిష్యత్తు ప్రణాలికల మీద వార్తలు ఏమి రాలేదు.
తాజాగా అతను ‘దేనికైనా రెడీ’ చిత్ర దర్శకుడు జి. నాగేశ్వర రెడ్డితో ఒక సినిమాలో నటించడానికి అంగీకరించాడు. ఇది కాక సాయి రత్నా క్రియేషన్స్ బ్యానర్ పై రామచంద్ర రావు నిర్మాతగా మరో చిత్రాన్ని అంగీకరించాడు. ఫిలిం నగర వర్గాల సమాచారం ప్రకారం అతను ఈ రెండు చిత్రాలే కాక మరో రెండు చిత్రాలు అంగీకరించాడని సమాచారం. ఇప్పుడు అతను నాలుగు చిత్రాలతో ఫుల్ జోరు మీద ఉన్నాడు. ఆ సినిమాలోని నటీనటుల, తదితర వివరాలు త్వరలోనే వెల్లడిస్తారు.