రేస్ పై ఆశలు పెట్టుకున్న మనసారా విక్రమ్

రేస్ పై ఆశలు పెట్టుకున్న మనసారా విక్రమ్

Published on Feb 28, 2013 8:50 PM IST

Race
రవిబాబు ‘మనసారా’ చిత్రం ద్వారా పరిచయమైన విక్రమ్ రాబోతున్న తన తాజా చిత్రం ‘రేస్’ పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. రమేష్ రాపర్తి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. బ్యాచిలర్ పార్టీ కోసం బ్యాంకాక్ వెళ్ళిన స్నేహితుల బృందం అనుకోని సంఘటన వల్ల ఎలాంటి పరిస్థితిలలో చిక్కుకుంది అనేది ఈ చిత్ర కథాంశం. ఇదే అంశంతో వచ్చిన ‘హేంగ్ఓవర్’, ‘జిందగీ న మిలేగా దూబారా’ చిత్రాలకి తమ చిత్రానికి ఏ విధంగాను పోలిక ఉండదని విక్రమ్ అంటున్నాడు.

ఈ చిత్రంలో అధిక భాగం బ్యాంకాక్ మరియు పరిసర ప్రాంతాలలో చిత్రీకరించారు. విక్రమ్, కార్తీక్, భరత్, దిశా పాండే, మరియు నిఖిత నారాయణ్ ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్లో ముఖ్య పాత్రలు పొషించారు. వివేక్ సాగర్ మరియు సంజయ్ సయుక్తంగా సంగీతం అందించిన ఈ చిత్రం మార్చ్ 1న రిలీజ్ అవ్వనుంది .

తాజా వార్తలు