అనుష్క పై పుకార్లు అన్ని అవాస్తవం – ‘నిశ్శబ్దం’ టీమ్

అనుష్క పై పుకార్లు అన్ని అవాస్తవం – ‘నిశ్శబ్దం’ టీమ్

Published on Apr 21, 2020 2:58 PM IST

స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో యంగ్ డైరెక్టర్ హేమంత్ మధుకర్ దర్శకత్వంలో రాబోతున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘నిశ్శబ్దం’ మూవీ గురించి ఇప్పటికే సోషల్ మీడియాలో అనేక రూమర్స్ వచ్చాయి. అయితే తాజాగా అనుష్క ఈ సినిమాకి సరిగ్గా సకరించడంలేదని రూమర్స్ రావడంతో.. చిత్రబృందం ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ ఆ రూమర్ పై తాజాగా స్పదించింది. ఈ సినిమా పై వస్తోన్న రూమర్స్ అన్ని.. ముఖ్యంగా అనుష్కగారి మీద వస్తోన్న రూమర్స్ అన్ని పూర్తి నిరాధారమైనవి, అవి పూర్తి అవాస్తవం.. వాటిని నమ్మకండి’ అని స్పష్టం చేసింది.

కాగా ఈ సినిమాలో అనుష్క ఆర్ట్ లవర్ గా కనిపించబోతుంది. ఇక మాధవన్ సెల్లో ప్లేయర్ గా నటించనున్నాడు. వీరిద్దరి క్యారెక్టర్స్ చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటాయట. అలాగే ఇద్దరి మధ్య ఓ రొమాంటిక్ సాంగ్ కూడా ఉందని తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో సుబ్బరాజు, అంజలి, షాలిని పాండే తో పాటు ప్రముఖ హాలీవుడ్ నటుడు మైఖేల్ మాడిసన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

మరి ‘భాగమతి’గా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ కొట్టి అనుష్క.. ఈ సినిమాతో కూడా మరో సూపర్ హిట్ అందుకుంటుందేమో. ప్రముఖ రచయిత కోన వెంకట్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు