మన తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ మొత్తం నాలుగు సీజన్లకు చేరుకుంది. ఇప్పటి వరకు చేసిన మూడు సీజన్లు ఒకెత్తు అయితే ఈసారి సీజన్ మాత్రం మరో ఎత్తు అని చెప్పాలి. ఆ మూడు సీజన్లకు మంచి హైప్ అండ్ రేటింగ్ లు వచ్చాయి కానీ ఈ నాలుగో సీజన్ కు మాత్రం మొదటి ఎపిసోడ్ నుంచే బిగ్ బాస్ ఫ్యాన్స్ డీలా పడిపోయారు. దీనికి కారణం బాగా పేరొందిన కంటెస్టెంట్స్ లేకపోవడమే అని గుట్టుగా వినిపిస్తుంది.
దీనితో ఇదే ఇలా కొనసాగితే రాబోయే ఎపిసోడ్స్ కు గాను ప్రేక్షకులలో మరింత ఉత్సుకత సన్నగిల్లుతుంది అని బిగ్ బాస్ 4 యాజమాన్యం ముందుగానే అందుకు ప్రణాళికలు వేస్తున్నారట. రాబోయే రోజుల్లో పలు కీలక మార్పులు చేయనున్నారని తెలుస్తుంది. ఈసారి పలువురు బాగా తెలిసిన వారినే బిగ్ బాస్ హౌస్ లోకి చేర్చనున్నారని టాక్ వినిపిస్తుంది. అలాగే మరింత మంది ఆసక్తికర వ్యక్తులను వీకెండ్స్ లో పిలిచి ఇంట్రాక్ట్ చేయనున్నారట. మరి ప్లానింగ్స్ వర్కౌట్ అవుతాయో లేదో చూడాలి.