మహేష్ మళ్ళీ ఆ రేంజ్ యాక్షన్ చూపించనున్నారా.?

మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “సర్కారు వారి పాట”. దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇపుడు దుబాయ్ షెడ్యూల్ లో బిజీ బిజీగా ఉంది. అయితే నిన్ననే మహేష్ ఈ షెడ్యూల్ లోని సార్జా ఎడారిలో షూట్ కు సంబంధించి ఫోటోలను మహేష్ షేర్ చేసుకున్నారు.

అయితే ఈ సీక్వెన్స్ కు సంబంధించి మరిన్ని ఇంట్రెస్టింగ్ డెవలెప్మెంట్స్ వినిపిస్తున్నాయి. అక్కడి షూట్ తాలూకా ఫొటోలే కాకుండా ఆన్ లొకేషన్ వీడియో కూడా బయటకొచ్చింది. ఇవన్నీ చూస్తుంటే మహేష్ తో మళ్ళీ ఓ హాలీవుడ్ లెవెల్ యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్నట్టు అనిపిస్తుంది.. మన తెలుగులో ఓ హీరో యాక్షన్ స్టంట్స్ చేస్తే ఆన్ స్క్రీన్ పై సూపర్బ్ గా అనిపించే వారిలో సూపర్ స్టార్ మహేష్ కూడా ఒకరు.

మరి మహేష్ నుంచి అప్పుడెప్పుడో “టక్కరి దొంగ”, “1 నేనొక్కడినే” సినిమాలలో మంచి మైండ్ బ్లోయింగ్ హాలీవుడ్ లెవెల్ యాక్షన్ సీక్వెన్స్ లు చూసాం. మరి ఇప్పుడు సర్కారు వారి పాట ఈ షూట్ స్పాట్ లో కార్లు రేస్ బైక్ లతో సెటప్ చూస్తుంటే గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. మరి ఈ సీక్వెన్స్ ఎలా ఉంటుందో తెలియాలి వచ్చే ఏడాది సంక్రాంతి వరకు ఆగాల్సిందే.

Exit mobile version