పెళ్లి చేసుకున్న మహేష్ హీరోయిన్.!

పెళ్లి చేసుకున్న మహేష్ హీరోయిన్.!

Published on Oct 22, 2012 12:00 PM IST


మోడల్ గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత హీరోయిన్ గా బాలీవుడ్లో అడుగుపెట్టిన అందాల భామ లిసా రే. ఈమె బాలీవుడ్ లోనే కాకుండా సౌత్ ఇండియాలో కూడా కనిపించి ప్రేక్షకులను అలరించారు. ఈ తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ‘టక్కరి దొంగ’ సినిమాలో మరియు తమిళంలో శరత్ కుమార్ సరసన ‘నేతాజి’ అనే సినిమాలో నటించారు. ఆ తర్వాత బాలీవుడ్ కి మాత్రమే పరిమితమైన లిసా రే కొంత కాలం కాన్సర్ వ్యాధి తో భాధపడ్డారు.దాని నుంచి కోలుకున్న ఈ అందాల భామ గత కొంత కాలంగా కాలిఫోర్నియా కి చెందిన జాసన్ డెన్ని తో ప్రేమలో ఉంది. వారిద్దరూ కాలిఫోర్నియాలోని నాపా వ్యాలీలో పెళ్లి చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రపంచ ప్రసిద్ది గాంచిన తబలా ఆర్టిస్ట్ సుపలా పెర్ఫార్మెన్స్ చేసి పెళ్ళికి వచ్చిన వారిని అలరించాడు.

తాజా వార్తలు