“సర్కారు వారి పాట”లో హాట్ టాపిక్ గా మహేష్ లుక్!

“సర్కారు వారి పాట”లో హాట్ టాపిక్ గా మహేష్ లుక్!

Published on Sep 1, 2020 9:02 AM IST

ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా “సర్కారు వారి పాట” అనే మాస్ ఫ్లిక్ లో నటించేందుకు రెడీ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్ మరియు మోషన్ పోస్టర్ టీజర్ ను కూడా ఇటీవలే చిత్ర యూనిట్ వదలగా భారీ రెస్పాన్స్ వచ్చింది.

అయితే దీనికి ముందు మూడు వరుస విజయాలు మహేష్ ఖాతాలో ఉండే సరికి ఈ చిత్రంపై ఎనలేని అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా ప్రీ లుక్ పోస్టర్ తోనే మహేష్ సరికొత్త లుక్ ఎలా ఉండనుంది అనే అంశం మంచి హాట్ టాపిక్ అయ్యింది. పోకిరి తర్వాత ఒకటి రెండు చిత్రాల్లో లాంగ్ హెయిర్ స్టైల్ తో కనిపించిన మహేష్ ఇప్పుడు మళ్ళీ ఈ చిత్రంలో కనిపించనున్నారని టాక్ వినిపిస్తుంది.

అయితే ప్రీ లుక్ పోస్టర్ లో ఉంగరాల శిరోజాలతో కనిపించిన మహేష్ ఇప్పుడు షూటింగ్ మొదలు అవుతుందన్న సమయంలో లాంగ్ హెయిర్ లోనే కాకపోతే స్ట్రెయిట్నింగ్ లుక్ లో కనిపిస్తున్నారు. అంటే మళ్ళీ పోకిరి సైనికుడు తరహా స్టైల్ ను ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా అని హాట్ టాపిక్ అవుతుంది. మరి మహేష్ ఎలా కనిపించనున్నారో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు