సూపర్ స్టార్ మహేష్ బాబు పోలీస్ గా చేసిన సినిమాలన్నిటికీ మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. ‘పోకిరి’, ‘దూకుడు’ సినిమా తర్వాత మరోసారి ‘ఆగడు’ సినిమాలో మరోసారి టఫ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. శ్రీను వైట్ల డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు పాత్ర చాలా కొత్తగా ఉంటుందని ఆశిస్తున్నారు.
14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు నిర్మించనున్న ఈ భారీ బడ్జెట్ ఎంటర్టైనర్ కి థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. మొదటి సారి ఈ సినిమాలో మహేష్ బాబు సరసన తమన్నా హీరోయిన్ గా నటించనుంది. ఈ మూవీ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. గతంలో మహేష్ బాబు – శ్రీను వైట్ల కాంబినేషన్లో వచ్చిన ‘దూకుడు’ సినిమా సూపర్ హిట్ అయ్యింది. మరోసారి ఈ సక్సెస్ ని రిపీట్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.