సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాని ఆగష్టు 9న అనగా సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజున విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమా 40రోజుల షూటింగ్ కొరకు వేసవి కాలంలో లండన్ వెళ్తోంది. దీనిలో కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తోంది.
14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై బారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా కొత్త స్క్రీన్ ప్లే తో సాగే థ్రిల్లర్ సినిమా అని అంచనా వేస్తున్నారు. గతంలో మహేష్ బాబు నటించిన ‘అతడు’ సినిమా ఆగష్టు 10న 2005లో విడుదలై ఘన విజయాన్ని సాదించింది.