మహేష్ బాబు సినిమా కోసం అన్నపూర్ణ 7 ఎకర్స్ లో స్పెషల్ సెట్టింగ్

మహేష్ బాబు సినిమా కోసం అన్నపూర్ణ 7 ఎకర్స్ లో స్పెషల్ సెట్టింగ్

Published on Sep 11, 2013 10:20 AM IST

Mahesh-Babu
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా ‘1-నేనొక్కడినే’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ కోసం అన్నపూర్ణ 7 ఎకర్స్ స్టూడియో లో స్పెషల్ సెట్టింగ్ వేయడం జరిగింది. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో ఈ నెల 16 వరకు జరిగే అవకాశం వుంది. ఈ సినిమా టీం సెప్టెంబర్ చివరి వారంలో బ్యాంకాక్ వెళ్ళనున్నారని అక్కడ ఈ సినిమాకి సంబందించిన ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించే అవకాశం ఉందని తెలిసింది. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తోంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నిర్మిస్తుంది. ఈ సినిమా మంచి నైపుణ్యంతో స్టైలిష్ గా తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఈ సినిమాని జనవరి 10, 2014 న విడుదల చేయడానికి నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు.

తాజా వార్తలు