ప్రస్తుతం మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ మాస్ ఫ్లిక్ “సర్కారు వారి పాట”. హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత టేకప్ చేసిన ప్రాజెక్ట్ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్ అనంతరం పక్కాగా కన్ఫర్మ్ అయ్యింది మాత్రం దర్శక ధీరుడు రాజమౌళితో ఓ ప్రాజెక్ట్.
అయితే మరి ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ కంటే ముందే మహేష్ ఖచ్చితంగా ఒకటి లేదా రెండు సినిమాలు చెయ్యడం ఖరారు అయ్యింది. మరి అది ఎవరితో చేస్తారు అనేదే మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. ఆ మధ్య త్రివిక్రమ్ పేరు కన్ఫర్మ్ అయ్యినా ఈ కాంబో ఇప్పట్లో పట్టాలెక్కే సూచనలు లేవు.
దీనితో మళ్ళీ కోలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ పేరు బాగా హాట్ టాపిక్ అయ్యింది. మరి ఇప్పుడు మరో టాలెంటెడ్ దర్శకురాలు సుధా కొంగర పేరు కూడా సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతుండడంతో మహేష్ లైనప్ మరింత ఆసక్తికరంగా మారింది. మరి ఈ ఇద్దరిలో ఎవరితో ఓ సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ అదరడం ఖాయం మరి దీనికి సమాధానం కాలమే చెప్పాలి.