యాంగ్రీ యంగ్ మాన్, పోలీస్ పాత్రలు చేయడంలో తనకంటూ ఓ ప్రత్యేకత ఉన్న రాజశేఖర్ మరో సారి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో మనముందుకు రాబోతున్న చిత్రం ‘మహంకాళి’. జీవితా రాజశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని మహిళా దినోత్సవం రోజున అనగా మార్చి 8న విడుదల చేయనున్నారు. ఈ రోజు ఏర్పాటు చేసిన ప్రెస్ మెట్లో రాజశేఖర్ మాట్లాడుతూ ‘ 24 ఏళ్ళ క్రితం నేను చేసిన ‘అంకుశం సినిమా ఎంత పేరు తెచ్చిందో అంతే పేరు ఈ సినిమా కూడా తెస్తుంది. జీవితా ఎంతో అద్భుతంగా తెరకెక్కించింది. ఎన్నో ఆటంకాలు ఎదుర్కొని పూర్తి చేసిన ఈ సినిమా అందరికీ నచ్చుతున్న నమ్మకం’ ఉందని అన్నారు.
అంజేరి ఆర్ట్ మూవీస్ బ్యానర్ పై సురేంద్ర రెడ్డి – పరంధామ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో మధురిమ హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు కూడా బాగా జోరుగా జరుగుతున్నాయి.