మహాత్ రాఘవేంద్ర, పియా బాజ్పాయ్, అర్చనా కవి కలిసి నటిస్తున్న మధుర శ్రీధర్ తాజా సినిమా ‘బ్యాక్ బెంచ్ స్టూడెంట్’కి చేతన్ భగత్ నవలతో బలమైన సంబంధం ఉంది. మధుర శ్రీధర్ తన సినిమాకి చేతన్ భగత్ రివల్యుషణ్ 20-20 నవలే ఆధారమని వెల్లడించారు. కాలేజి లైఫ్ లో ఒక స్టూడెంట్ ఫెయిల్ అయ్యాక పరిస్థితి ఏంటి అనేది కధాంశం.
మదుర శ్రీధర్ చేతన్ భగత్ ని చేర్చడం ఇదేం మొదటిసారి కాదు.
రెండేళ్ళ క్రితం మద్ర శ్రీధర్ లాంచ్ చేసిన ‘ఇట్స్ మై లవ్ స్టోరీ’ పోస్టర్లలో హీరో, హీరొయిన్లు చేతన్ భగత్ రాసిన 3 మిస్టేక్స్ అఫ్ మై లైఫ్ పుస్తకాన్ని చదువుతున్నట్టు చూపించాడు. తరువాత ఆ చిత్రం ప్రీమియర్ షోకి ఆ రచయితని ఆహ్వానించగా అతను అంగీకరించాడు. ఇప్పుడు ఈ ‘బ్యాక్ బెంచ్ స్టూడెంట్’ పోస్టర్లో చేతన్ భగత్ మరో పుస్తకం వాట్ యంగ్ ఇండియా వాంట్స్ చదువుతున్నట్టు చూపించాడు. ‘బ్యాక్ బెంచ్ స్టూడెంట్’ ఆడియోకి విడుదల అయ్యి పాటలకి మంచి స్పందన లబిస్తోంది. సునీల్ కశ్యప్ సంగీతం అందించాడు. ఎమ్.వి.కె రెడ్డి ఈ సినిమాకి నిర్మాత.