కామెడీ యాక్టర్ ఎం.ఎస్ నారాయణ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోగా నటిస్తున్న ‘బాద్షా’ సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నాడు. అలాగే ఎం.ఎస్ నారాయణ ఆయన పార్ట్ కి డబ్బింగ్ మొదలు పెట్టారు. ఇప్పటికే ఎక్కువ భాగం టాకీ పార్ట్ పూర్తి చేసుకోగా ప్రస్తుతం ఎన్.టి.ఆర్ – కాజల్ పై పాటలను షూట్ చేస్తున్నారు.
ఎం.ఎస్ నారాయణ ఈ సినిమాలో ఓ ఫేమస్ డైరెక్టర్ గా కనిపించనున్నాడని సమాచారం. ఈ సినిమాలో హై కామెడీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. డైరెక్టర్ శ్రీను వైట్ల ప్రతి సినిమాలో లాగానే ఈ సినిమాలో కూడా బ్రహ్మానందం, ఎం.ఎస్ నారాయణ, జయప్రకాశ్ రెడ్డి నటిస్తున్నారు. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్ర ఆడియో లాంచ్ మార్చ్ 10న హైదరాబాద్లో జరగనుంది.