లవ్ టు లవ్ అంటున్న శ్రియ,ఆర్య

లవ్ టు లవ్ అంటున్న శ్రియ,ఆర్య

Published on Oct 22, 2012 6:00 PM IST


తమిళంలో “చికుబుకు” అనే పేరుతో విడుదలయిన చిత్రాన్ని తెలుగులోకి “లవ్ టు లవ్” అనే పేరుతో అనువదించారు. మనదేశం మూవీస్ పథకం మీద అశోక్ వల్లభనేని ఈ చిత్రాన్ని అనువదించారు. ఈ చిత్రంలో ఆర్య, శ్రియ ప్రధాన పాత్రలు పోషించారు. హరిహరన్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో హైదరాబాద్లో విడుదల అయ్యింది. హీరో శ్రీకాంత్ ఈ చిత్ర ఆడియో సీడీని ఆవిష్కరించారు. ఈ వేడుకలో పరుచూరి గోపాలకృష్ణ, బి.గోపాల్, చంద్రసిద్దార్థ్, టి.ప్రసన్నకుమార్ మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఆర్య, శ్రీయ, ప్రీతికాల నటన ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది. నవంబర్‌లో సినిమాని విడుదల చేయాలనుకుంటున్నాం అని అశోక్ చెప్పారు.

తాజా వార్తలు