నైజాం రైట్స్ దక్కించుకున్న దిల్ రాజు


శేకర్ కమ్ముల దర్శకత్వంలో నూతన నటీనటులతో తెరకెక్కిన ‘ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రం సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం యొక్క నైజాం రైట్స్ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు దక్కించుకున్నారు. శేకర్ కమ్ముల తీసిన ‘హ్యాపీ డేస్’ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్ అంటా విడుదల చేసిన దిల్ రాజు ఈ చిత్రం విషయంలో మాత్రం ఒక్క నైజాం ఎరియాతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ చిత్రం యొక్క ఆంధ్రా రైట్స్ ఇప్పటికే అమ్ముడు పోగా, సీడెడ్ రైట్స్ బుజినెస్ కూడా ముగింపు దశలో ఉంది. ఈ చిత్ర చిత్రీకరణలో అనుకున్న దానికంటే ఎక్కువ రేటుకి ఓవర్సీస్ రైట్స్ అమ్ముడు పోవడం విశేషం. ఇప్పటికే ఈ చిత్రం యొక్క శాటిలైట్ రైట్స్ ని మా టీవీ సొంతం చేసుకుంది. ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్న ఈ చిత్రం శేకర్ కమ్ముల కెరీర్లోనే అత్యధిక బుజినెస్ చేసింది. ఈ చిత్రంలో అక్కినేని అమల మరియు శ్రియ సరన్ ప్రత్యేక పాత్రల్లో కనిపించనుండడం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ.

Exit mobile version