సెంటిమెంట్ సన్నివేశాలే లెజెండ్ ప్రధానబలం

సెంటిమెంట్ సన్నివేశాలే లెజెండ్ ప్రధానబలం

Published on Mar 25, 2014 10:50 PM IST

legend

బాలకృష్ణ తాజా చిత్రం లెజెండ్ సినిమా మార్చ్ 28న భారీ విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకుడు. ఈ సినిమాకు రాధికా ఆప్టే, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్. అనీల్ సుంకర, గోపీచంద్ మరియు రామ్ ఆచంట ఈ సినిమాని 14రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. సాయి కొర్రపాటి సమర్పకుడు

ఈ సినిమా సెన్సార్ ఈరోజు ముగించుకుందిరేపు ఉదయం సర్టిఫికేట్ ను ప్రకటించనున్నారు. సమాచారం సెన్సార్ సభ్యులకు ఈ సినిమా చాలా నచ్చేసిందట. బాలయ్య బాబు చెల్లెలుగా నటించిన సితార మధ్య తెరకెక్కించిన సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయట. ప్రధమార్ధంలో బ్రాహ్మీ చేసిన కామెడికూడా చాలా బాగుందని సమాచారం. బాలకృష్ణ పేల్చినా పవర్ ఫుల్ డైలాగులు ఆకర్షణ అని సమాచారం

ఈ సినిమాలో జగపతిబాబు విలన్ పాత్ర పోషిస్తున్నాడు. సమాచారం ప్రకారం బాలయ్య పాత్ర మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుందట. దేవిశ్రీ ప్రసాద్ సంగీతదర్శకుడు. ఈ సినిమా విడుదలకాకముందే అందరి అంచనాలూ ఆకాశాన్ని అందుకోవడం సినిమాకు కలిసొచ్చే అంశం

తాజా వార్తలు