యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తో విక్టరీ వెంకటేష్ ఆ మధ్య ఓ ప్రాజెక్ట్ చేయాలనుకోవడం, పైగా తరుణ్ భాస్కర్ స్క్రిప్ట్ ను కూడా పూర్తి చేయడం.. అలాగే ఆ ఫుల్ స్క్రిప్ట్ ను వెంకటేష్ కి కూడా వినిపించడం తెలిసిన విషయాలే. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక అప్ డేట్ తెలిసింది. మే తరువాత నుండి ఈ సినిమాని స్టార్ట్ చేసేలా వెంకీ ప్లాన్ చేస్తున్నాడట. స్క్రిప్ట్ విన్న వెంకీ మరియు సురేష్ బాబు ఈ సినిమాకి మే నుండి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.
కాకపోతే ఈ సినిమా వచ్చే ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎఫ్ ౩ షూటింగ్ పూర్తవ్వగానే ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. కాగా తరుణ్ భాస్కర్ తో విక్టరీ వెంకటేష్ సినిమా హార్స్ రేసింగ్ నెపథ్యంలో సాగుతుందని, చాలా వరకు సినిమాలో మంచి ఎంటర్ టైన్మెంట్ ఉంటుందని తెలుస్తోంది. మొత్తానికి ‘వెంకీ’ నుండి కొత్త బ్యాక్ డ్రాప్ లో వస్తోన్న ఈ సినిమా కోసం వెంకీ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రాన్ని వెంకీ హోమ్ బ్యానర్ సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించనుంది.