ఖాళీ టైంను బాగానే వాడుకుంటున్న మాస్ డైరెక్టర్ !

ఖాళీ టైంను బాగానే వాడుకుంటున్న మాస్ డైరెక్టర్ !

Published on Mar 23, 2020 7:00 PM IST

తమిళ్ స్టార్ హీరో సూర్య, మాస్ డైరెక్టర్ హరి కాంబినేషన్ లో మరో సినిమాకి రంగం సిద్ధం అయిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం కరోనా కారణంగా అందరూ ఇంటికే పరిమితం అయ్యారు. దాంతో హరికి ఖాళీ టైం దొరకడంతో స్క్రిప్ట్ పై కూర్చున్నాడట. సూర్య 39వ ప్రాజెక్ట్ గా వస్తోన్న ఈ సినిమాలో సూర్య కోసం డబల్ రోల్స్ ను డిజైన్ చేసాడట. ఇద్దరు కవలలుగా పుట్టిన వాళ్లలో ఒక్కళ్ళు చెడు మార్గాన్ని ఎంచుకుంటే రెండో వాడు ఆ చెడును ఎలా ఆపాడు అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా స్క్రిప్ట్ ను హరి రాసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ మాస్ డైరెక్టర్ ఖాళీ టైంను భాగమే ఉపయోగించుకుంటున్నాడు.

ఇక సూర్య ఫాన్స్ సూర్యని ఎలా చూడాలనుకుంటారో.. అంతకు మించి పవర్ ఫుల్ గా సూర్యని చూపిస్తూంటాడు హరి. అందుకే వీరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలకు మాస్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. సూర్య – హరి కాంబినేషన్ అంటే.. అటు తమిళంలోనే కాకుండా ఇటు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. వీరి ఇద్దరి కలయికలో ఇంతకుముందు వచ్చిన ఆరు, వేల్, సింగం 1,2,3 సీక్వెల్స్‌ సూపర్ హిట్‌ అయ్యాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు