ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో సినిమాల రిలీజ్ డేట్లును వరుసగా ఎనౌన్స్ చేస్తున్నారు. బాలయ్య బాబు బోయపాటి శ్రీను సినిమా షూటింగ్ శరవేగంగా జరుతోన్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాని రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మే 15న సినిమాని విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేసుకుంటున్నారు. అందుకే బాలయ్య ఈ సినిమా కోసం గ్యాప్ లేకుండా షూట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా టైటిల్ పై అనేక రూమర్స్ వచ్చినా, ఈ చిత్రానికి ‘మోనార్క్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారని టాక్.
త్వరలోనే ఈ టైటిల్ ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. మొత్తానికి బాలయ్య జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ఫుల్ బిజీ అవుతున్నారు. కాగా బాలయ్యకు ‘సింహ’ రూపంలో పెద్ద హిట్ ఇచ్చిన బోయపాటి ఆ తర్వాత దాన్ని మించి ‘లెజెండ్’ విజయాన్ని అందించారు. కాబట్టి ఈసారి ‘లెజెండ్’ను మించిన హిట్ పడాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు.