బాలుగారి ఆరోగ్యం పై లేటెస్ట్ అప్ డేట్ !

బాలుగారి ఆరోగ్యం పై లేటెస్ట్ అప్ డేట్ !

Published on Aug 22, 2020 7:22 PM IST

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం పై తాజా అప్ డేట్ ఏమిటంటే, ఆయన ప్రస్తుతం ఐసియులో ఉన్నారు. అయితే ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. సోమవారం స్పృహలోకి వచ్చే అవకాశం ఉంది. చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌కేర్‌ ఆస్పత్రి నిర్వాహకులు బాలుగారి ఆరోగ్య పరిస్థితి గురించి చెప్తూ.. ప్రస్తుతం బాలుగారు చికిత్స కొనసాగిస్తున్నామని.. ఆయన కోలుకుంటున్నారని తెలిపారు.

ఇక తమ అభిమాన గాయకుడు త్వరగా కోలుకోవాలని ప్రతి ఒక్కరూ ప్రార్ధనలు చేస్తున్నారు. మొన్న తమిళ స్టార్లు రజనీకాంత్‌, కమల్‌హాసన్‌ తో పాటు లెంజడరీ సంగీత దర్శకులు ఇళయరాజా, ఏఆర్‌ రహ్మాన్‌, సినీ గేయరచయిత వైరముత్తు సహా పలువురు సినీ ప్రముఖులు గురువారం సాయంత్రం 6గంటలకు సామూహిక ప్రార్థనలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అలాగే లక్షలాది అభిమానులు బాలుగారి ఆరోగ్యం కోసం పూజలు కూడా చేస్తున్నారు.

తాజా వార్తలు