ప్రస్తుతం నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కోసమే మాస్ ఆడియెన్స్ మరియు నందమూరి అభిమానులు ఎదురు చూస్తున్నారు. మరి ఇదిలా ఉండగా వీరి కాంబో నుంచి ఇది హ్యాట్రిక్ సినిమా కావడంతో దీనిపై మరో స్థాయి అంచనాలు కూడా నెలకొన్నాయి.
అయితే ఇప్పటి వరకు ఎన్నో అప్డేట్స్ ను రివీల్ చేసిన చిత్ర యూనిట్ ఇంకా సినిమా టైటిల్ ఏంటి అన్నది వెల్లడి చెయ్యలేదు. దీనితో ఈ సినిమాకు ఎలాంటి టైటిల్ పెడతారా అని అంతా ఎదురు చూస్తున్నారు. లాస్ట్ రెండు సినిమాలను మ్యాచ్ చేసేలా అంతకు మించే స్థాయిలో అనుకుంటున్నారని వింటూనే ఉన్నాం. కానీ పలు ఇంట్రెస్టింగ్ టైటిల్స్ మాత్రం అలా వినిపిస్తూనే ఉన్నాయి.
ఇప్పుడు మళ్ళీ అదే రచ్చ ఈ సినిమా టైటిల్ కు సంబంధించి స్టార్ట్ అయ్యింది. ఈ సినిమాకు గాను మేకర్స్ “గాడ్ ఫాథర్” అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఫిక్స్ చేసినట్టుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే ద్వారకా క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.