ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మూడు భారీ హిట్లు తర్వాత అదే పరంపర కొనసాగిస్తూ దర్శకుడు పరశురామ్ తో “సర్కారు వారి పాట” అనే మాస్ ఫ్లిక్ ను స్టార్ట్ చేసి విపరీతమైన హైప్ ను తెచ్చుకున్నారు. అలాగే దీని తర్వాత కూడా దర్శక ధీరుడు రాజమౌళితో ఒక పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ ఉంది.
అలాగే బహుశా దీనికి ముందే మహేష్ ఒకటి రెండు ప్రాజెక్టులు కూడా చేసీ అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపించింది. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా మహేష్ కెరీర్ లో ఎన్నో అంచనాలు రేపి ఊహించని పరాభవాన్ని మిగిల్చిన దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ తో ప్రాజెక్ట్ ఉండనుంది అని కొత్త రూమర్స్ మొదలయ్యాయి.
అయితే ఇంకా వీరి కాంబో మళ్ళీ సెట్ అయ్యిందని ఇంకా కన్ఫర్మ్ కాలేదు కానీ మురుగదాస్ ఒక స్క్రిప్ట్ ను రెడీ చేస్తున్నారని రూమర్స్ జోరుగా వినిపిస్తున్నాయి. కానీ ఇందులో అయితే ఎలాంటి నిజమూ లేదని మరో టాక్ వినిపిస్తుంది. మరి ఏ వెర్షన్ నిజం అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ఒకవేళ నిజంగానే ఈ కాంబో సెట్ అయితే మురుగదాస్ మహేష్ ఋణం తీర్చుకుంటారో లేదో చూడాలి.