రీసెంట్ గానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరిహర వీరమల్లు అలాగే ఓజి చిత్రాలతో ఈ ఒక్క ఏడాదిలోనే పలకరించిన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాలు కాకుండా నెక్స్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ ఒక్క సినిమాతో తాను బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమాలు కాకుండా ఇటీవల పవన్ మరికొన్ని సినిమాలకి ఓకే చెప్పినట్టుగా పలు రూమర్స్ వచ్చాయి.
ఇలా పవన్ లైనప్ కి సంబంధించి వచ్చిన రూమర్స్ పై లేటెస్ట్ క్లారిటీ ఇప్పుడు తెలుస్తుంది. నిజానికి పవన్ కళ్యాణ్ ఏ కొత్త సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. కేవలం ఇపుడు తన రాజకీయ పరమైన పనుల పైనే దృష్టి పెట్టినట్టుగా ఇపుడు తెలుస్తుంది. సో పవన్ కళ్యాణ్ ఈ దర్శకునితో చేయనున్నారు ఆ దర్శకునితో చేయనున్నారు అని ఇటీవల వచ్చిన వార్తల్లో అయితే నిజం లేదనే అనుకోవాలి. ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ ని మాత్రం వచ్చే ఏడాది రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు.