టాలీవుడ్ స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ తన లాస్ట్ చిత్రాలకు సంగీత దర్శకుడిగా థమన్ను ఎంచుకుంటూ వస్తున్నారు. అటు థమన్ కూడా త్రివిక్రమ్ ప్రతి సినిమాకు బెస్ట్ మ్యూజిక్ ఇస్తూ వస్తున్నాడు. అయితే, వెంకటేష్ హీరోగా రూపొందుతున్న తాజా సినిమాకు త్రివిక్రమ్ థమన్ను రీప్లేస్ చేసి హర్షవర్ధన్ రమేశ్వర్ను ఎంపిక చేశారు. దీంతో అభిమానులు ఆశ్చర్యానికి గురయ్యారు.
దీంతో త్రివిక్రమ్-థమన్ మధ్య ఏదైనా విభేదం వచ్చిందా..? అనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే, వాస్తవానికి థమన్ ప్రస్తుతం అనేక సినిమాలతో బిజీగా ఉన్నాడు. దీంతో పాటు ఆయన భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు.
ఈ క్రమంలో త్రివిక్రమ్ సినిమా కోసం ఎక్కువ సమయం కేటాయించి, పారితోషిక విషయంలో సౌకర్యంగా ఉండే సంగీత దర్శకుడిని ఎంపిక చేయాలని మేకర్స్ భావించారు. ఈ క్రమంలో హర్షవర్ధన్ రమేశ్వర్ ఆయనకు సరైన ఎంపికగా భావించారు.