ప్రస్తుతానికి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లైన్ లో ఉన్న మొదటి భారీ పాన్ ఇండియన్ చిత్రం “రాధే శ్యామ్”. దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్ పై అన్ని వర్గాల సినీ ప్రేక్షకుల్లో డీసెంట్ అంచనాలు ఉన్నాయి. అయితే రాధాకృష్ణ ఎంచుకున్న ప్లాట్ క్లీన్ లవ్ స్టోరీ అలాగే ఒక పీరియాడిక్ నేపథ్యంలోనిది అని తెలిసిందే. కానీ ఈ చిత్రంలో నటిస్తున్న ప్రధాన పాత్రధారులు ప్రభాస్ మరియు పూజా హెగ్డేల రోల్స్ ఏమిటి అన్నవి ఇంకా సరైన క్లారిటీ లేదు.
అయితే ఇపుడు తాజాగా చిత్ర యూనిట్ వచ్చే సెప్టెంబర్ రెండో వారం నుంచే షూటింగ్ పునః ప్రారంభం చేయనున్నామని తెలిపారు. అలాగే మొదటి షూట్ కూడా హీరోయిన్ పూజా హెగ్డే మీద సీన్లతోనే మొదలు పెట్టనున్నారని టాక్ వినిపించింది. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న బజ్ ప్రకారం ఈ చిత్రంలో పూజా ఒక ప్రిన్సెస్ లా కనిపించనుంది అని గాసిప్స్ వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే అందుకు ఆస్కారం కూడా లేకపోలేదు అని చెప్పొచ్చు. ఎలాగో పీరియాడిక్ రొమాంటిక్ లవ్ స్టోరీ కాబట్టి పూజా అలా కనిపించినా ఆశ్చర్యం లేదని చెప్పొచ్చు. ఒక వేళా పూజా ఆ రోల్ అయితే మరి దర్శకుడు ఏ సంవత్సరం కాలం నాటి చిత్రంగా చూపించనున్నాడో అన్నది ఆసక్తికరంగా మారింది.