ఇప్పుడు మన ఇండియాలో ఉన్న భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్టులలో బాహుబలి తర్వాత అన్ని భాషల్లోనూ మంచి హైప్ ను తెచ్చుకున్న చిత్రం ‘కేజీయఫ్ చాప్టర్ 2″. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రం మొదటి భాగం ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొనసాగింపుగా మొదటి చాప్టర్ కంటే మరింత భారీ యాక్షన్ సీక్వెన్స్ లతో చాప్టర్ 2 ను స్టార్ట్ చేశారు.
ఇప్పటికే చాలా వరకు షూట్ ను పూర్తి చేసుకున్న ఈ భారీ చిత్రం కరోనా వల్ల అన్ని చిత్రాల్లానే బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. దీనితో ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడు పూర్తయ్యి ఎప్పుడు విడుదల అవుతుందా అని కేజీయఫ్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న బజ్ ప్రకారం ఈ ఆగస్ట్ 26 నుంచి మొదలు పెట్టి క్లైమాక్స్ మినహా మిగతా సన్నివేశాలు మిగతా అంతా ఈ షెడ్యూల్ లో పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నారట.
అయితే కీలకమైన క్లైమాక్స్ ఎప్పుడు పూర్తి కానుందో తెలియని పరిస్థితిలో వారు ఉన్నారు. ఇప్పటికే సంజయ్ దత్ ఆరోగ్యంతో పోరాడుతున్నారు. అందుకే ఆయన లేకుండా మిగతా సన్నివేశాలను తీసేయాలని తర్వాత సంజయ్ మరియు యష్ ల మధ్య కీ సీన్స్ తియ్యాలని టీం అనుకున్నారు. మరి ఈ చిత్రం మొత్తం షూటింగ్ పూర్తయ్యి ఎప్పుడు విడుదల కానుందో చూడాలి.