స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా ఇంటెలిజెంట్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ అండ్ పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప”. చాలా కాలం గ్యాప్ తర్వాత స్టార్ట్ కాబడిన ఈ చిత్రం షూటింగ్ లోని కీలక షెడ్యూల్స్ ను మేకర్స్ కొన్ని రోజుల కిందటే ముగించేశారు.
మారేడుమిల్లి మరియు రంపచోడవరం అడవుల్లో సుకుమార్ ప్లాన్ చేసిన పలు ఇంటెన్స్ యాక్షన్ అండ్ ఎమోషనల్ సన్నివేశాలు తెరకెక్కించారు. ఇక దీని తర్వాత కేరళలో ఒక కీలక షెడ్యూల్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. మరి దీనిపై ఇప్పుడు లేటెస్ట్ బజ్ ఒకటి వినిపిస్తుంది.
ఈ షూట్ కు సంబంధించి చిత్ర యూనిట్ అన్ని అనుమతులను తీసుకున్నట్టు తెలుస్తుంది. అలాగే ఇక్కడ కూడా కొన్ని ఆసక్తికర యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తారనీ టాక్..ఇక అన్నీ సెట్ చేసుకొని తొందరలోనే అక్కడ షూట్ ను మొదలు పెట్టనున్నారట. ఇక ఈ భారీ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.