చివరి ముప్పై నిముషాలు ఈ సినిమాకి ప్రాణం : నాగార్జున

చివరి ముప్పై నిముషాలు ఈ సినిమాకి ప్రాణం : నాగార్జున

Published on Oct 17, 2012 6:37 PM IST

నాగార్జున, అనుష్క జంటగా నటించిన సోషియో ఫాంటసీ చిత్రం ‘డమరుకం’ చిత్ర ఫస్ట్ కాపీ నిన్ననే చూశానని సినిమా చాల బాగా వచ్చిందని ఈ చిత్ర హీరో నాగార్జున అన్నారు. ఈ చిత్ర విశేషాలను తెలియజేయడానికి ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ‘ఈ సినిమా చివర్లో వచ్చే 30 నిమిషాల గ్రాఫిక్స్ అధ్బుతంగా వచ్చాయి. ఈ సినిమాలో గ్రాఫిక్స్ లార్డ్ అఫ్ ది రింగ్స్, మమ్మీ వంటి హాలీవుడ్ సినిమాల రేంజ్ లో ఉన్నాయి. అలా అని కేవలం గ్రాఫిక్స్ వలనే సినిమా హిట్ అవుతుందని నేను చెప్పట్లేదు. హిందూ ఆచారాలకు బాగా చూపిస్తూ ఉంటుంది. ఈ సినిమాలో వచ్చే సీక్వెన్స్ కోసం అవసరం అని కెమెరామెన్ చోటా కే నాయుడు, దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి చెప్పడంతో సిక్స్ ప్యాక్ చేయాల్సి వచ్చింది. ఈ సినిమాలో నా పాత్ర గోదావరి యాసలో సాగుతుంది. క్లైమాక్స్ లో వచ్చే సన్నివేశాలు అందరికీ నచ్చుతాయన్న నమ్మకంతో ఉన్నారు నాగార్జున.

తాజా వార్తలు