రానా, నయనతార ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం “కృష్ణం వందే జగద్గురు” చిత్రం దాదాపుగా పూర్తి కావచ్చింది. గత కొన్నిరోజులగా చిత్రీకరణలో పాల్గొన్న రానా ఈ చిత్రానికి డబ్బింగ్ చెప్పడం కూడా మొదలు పెట్టారని సమాచారం. చిత్రంలో ప్రధాన టాకీ భాగం ఇంకా యాక్షన్ సన్నివేశాలన్నీ పూర్తి కావడంతో నిర్మాణాంతర కార్యక్రమాలు మొదలు పెట్టుకుంది. ఈ చిత్రం గురించి మాట్లాడుతూ “కృష్ణం వందే జగద్గురుం చిత్రానికి డబ్బింగ్ చెబుతున్నాను ఈ వీకెండ్ కి మొదటి అర్ధ భాగం డబ్బింగ్ పూర్తవుతుంది” అని రానా ట్వీట్ చేశారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సాయి బాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు రానా ఈ చిత్రంలో థియేటర్ ఆర్టిస్ట్ గా కనిపించనున్నారు నయనతార డాకుమెంటరీ ఫిలిం మేకర్ గా కనిపించనుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి జ్ఞాన శేకర్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. ఈ ఏడాదే ఈ చిత్రం విడుదల కానుంది.