అక్కడ మోసపోయిన ‘కుబేర’!?

అక్కడ మోసపోయిన ‘కుబేర’!?

Published on Jun 24, 2025 7:12 AM IST

కోలీవుడ్ స్టార్ ధనుష్ అలాగే టాలీవుడ్ నుంచి కింగ్ నాగార్జున సాలిడ్ పాత్రలో దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే కుబేర. మంచి అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా ధనుష్ కెరీర్లోనే సాలిడ్ ఓపెనింగ్స్ అందుకొని అదరగొట్టింది. అయితే డే 1 నుంచే కుబేర సినిమాకి సూపర్ పాజిటివ్ టాక్ దక్కింది. ఇది తెలుగు, తమిళ బై లింగువల్ సినిమా అని అందరికీ తెలిసిందే.

కానీ తెలుగులో అదరగొడుతున్న ఈ సినిమా తమిళ్ లో మోసపోయినట్టు తెలుస్తోంది. తమిళ నాట ఈ సినిమా ఎందుకో అండర్ పెర్ఫామ్ చేస్తుందట. అక్కడ విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించినప్పటికీ తమిళ ఆడియెన్స్ ఈ ఎమోషనల్ డ్రామాని సినిమాని సెలబ్రేట్ చేసుకోడంలో ఫెయిల్ అయ్యారని చెప్పక తప్పదు. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు అలాగే అమిగోస్ క్రియేషన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు