‘కన్నప్ప’లో ప్రభాస్, మంచు విష్ణు.. వేరే లెవెల్ అంటున్న స్టార్ రైటర్!

‘కన్నప్ప’లో ప్రభాస్, మంచు విష్ణు.. వేరే లెవెల్ అంటున్న స్టార్ రైటర్!

Published on Jun 24, 2025 7:00 PM IST

టాలీవుడ్‌లో ప్రస్తుతం అందరి చూపు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘కన్నప్ప’ మూవీపైనే ఉంది. హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ఈ చిత్రం రూపొందింది. ఇక ఈ సినిమాను డా ఎం.మోహన్ బాబు అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేయగా పాన్ ఇండియా చిత్రంగా ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అయింది.

ఈ సినిమాలో భారీ స్టార్ క్యాస్టింగ్ నటిస్తుండటంతో వివిధ భాషల అభిమానుల్లో ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. ముఖ్యంగా ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తుండటంతో అందరి చూపులు వీరి పాత్రలపైనే ఉన్నాయి.

ఇక ఇదే విషయాన్ని ప్రముఖ రచయిత, డైరెక్టర్ బివిఎస్ రవి కూడా అన్నారు. ‘కన్నప్ప’ లాంటి సినిమాను చూడటం ఒకెత్తు అయితే, ఈ సినిమాలో ప్రభాస్, మంచు విష్ణు, మోహన్ బాబు మధ్య వచ్చే సీన్స్ మరో ఎత్తు అంటూ ఆయన కామెంట్ చేశారు. ఈ సినిమా ప్రతి తెలుగువాడు తప్పకుండా చూడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. జూన్ 27న ఈ మూవీ అత్యంత భారీ స్థాయిలో పాన్ ఇండియా భాషల్లో రిలీజ్‌కు రెడీ అయింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు