హీరో రెమ్యునరేషన్‌కు కోత.. దిల్ రాజు చెప్పిన వేకప్ కాల్ ఇదే!

హీరో రెమ్యునరేషన్‌కు కోత.. దిల్ రాజు చెప్పిన వేకప్ కాల్ ఇదే!

Published on Jun 24, 2025 9:59 PM IST

ప్రస్తుతం టాలీవుడ్‌లో ఒక సినిమా రిలీజ్ డేట్‌ను నిర్ణయిస్తుంది కేవలం ఓటీటీలు మాత్రమే అని మూవీ మేకర్స్ క్లియర్‌గా చెబుతున్నారు. అయతే, కొందరు స్టార్ ఫిల్మ్ మేకర్స్ మాత్రం ఈ విషయంపై నోరు విప్పడం లేదు. కానీ, మరికొందరు స్టార్ నిర్మాతలు ఈ విషయంపై కుండబద్ధలు కొడుతున్నారు. తాజాగా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ విషయంపై తనదైన కామెంట్స్ చేశారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో నాన్-థియేట్రికల్ బిజినెస్‌లే ఓ సినిమాకు కీలకంగా మారాయని.. థియేట్రికల్ రన్‌లో ఏ సినిమాకు ఎంతమేర కలెక్షన్స్ వస్తాయనేది ఖచ్చితంగా ఎవరూ చెప్పలేరని.. అందుకే వీలైనంత వరకు నాన్-థియేట్రికల్ రైట్స్‌నే చిత్ర నిర్మాతలు నమ్ముకుంటున్నారని ఆయన తెలిపారు. దీంతో ఓ సినిమా రిలీజ్ డేట్‌ను కూడా ఓటీటీ సంస్థలే నిర్ణయిస్తున్నాయని ఆయన అన్నారు.

ఇది పరోక్షంగా హీరోల రెమ్యునరేషన్ కోతకు కూడా దారితీస్తుందని ఆయన తెలిపారు. ఆయన ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తున్న ‘తమ్ముడు’ సినిమాకు కూడా ఇదే ప్రభావం కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. తమ్ముడు చిత్ర నాన్-థియేట్రికల్ బిజినెస్ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని హీరో నితిన్ తన రెమ్యునరేషన్ తగ్గించుకోవాల్సి వచ్చినట్లు ఆయన కామెంట్స్ చేశారు. ఇది నిజంగా టాలీవుడ్ పరిశ్రమకు వేకప్ కాల్ లాంటిదని ఆయన వ్యాఖ్యానించారు. మరి దిల్ రాజు చేసిన కామెంట్స్‌పై మిగతా ప్రొడ్యూసర్ ఏమైనా స్పందిస్తారేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు