‘కన్నప్ప’ సెన్సార్ పూర్తి.. ఫైనల్ రన్‌టైమ్ ఎంతంటే..?

‘కన్నప్ప’ సెన్సార్ పూర్తి.. ఫైనల్ రన్‌టైమ్ ఎంతంటే..?

Published on Jun 24, 2025 6:03 PM IST

మంచు విష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘కన్నప్ప’ మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సినిమాను బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేయగా భారీ తారాగణం ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

తాజాగా ఈ చిత్రం సెన్సార్ పనులు కూడా పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ చిత్రాన్ని మొత్తంగా 195.02 నిమిషాల రన్‌టైమ్‌తో చిత్ర యూనిట్ సెన్సార్‌కు సబ్మిట్ చేశారు. కానీ, సినిమాలోని కొన్ని సీన్స్‌కు సెన్సార్ అభ్యంతరం తెలిపింది. దీంతో దాదాపు 12.11 నిమిషాల మేరకు సీన్స్‌ను మేకర్స్ ట్రిమ్ చేశారు.

దీంతో ఈ చిత్ర ఫైనల్ రన్‌టైమ్ దాదాపు 183 నిమిషాలు(3 గంటల 3 నిమిషాలు)గా లాక్ అయింది. ఇక సెన్సార్ పనులు కూడా ముగియడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాలో మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు