దీపావళికి రానా వస్తాడా?

దీపావళికి రానా వస్తాడా?

Published on Oct 23, 2012 7:20 PM IST


టాలీవుడ్ యంగ్ హంక్ దగ్గుబాటి రానా హీరోగా, ‘గమ్యం’మరియు ‘వేదం’ చిత్రాల దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘కృష్ణం వందే జగద్గురుమ్’. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకోగా, ప్రస్తుతం ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఆన్నీ అనుకున్న టైంకి పూర్తయితే ఈ సినిమాని దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారు. రానా సరసన నయనతార కథానాయికగా నటించారు. నయనతార ఈ చిత్రంలో జర్నలిస్ట్ పాత్రలో కనిపించనున్నారు. సమీరా రెడ్డి ఒక ఐటెం సాంగ్ లో మెరవనున్న ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ అతిధి పాత్రలో కనిపించనున్నారు. తెలుగు మరియు తమిళ భాషల్లో తెరకెక్కించిన ఈ సినిమాని ఒకే సారి విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాని ‘ఒన్గరం’ పేరుతో తమిళంలో విడుదల చేయాలనుకుంటున్నారు. స్వరబ్రహ్మ మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని సాయిబాబు జాగర్లమూడి మరియు వై. రాజీవ్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు.

తాజా వార్తలు