ప్రస్తుతం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. దర్శకుడు ప్రశాంత్ నీల్ తో చేస్తున్న ఈ బిగ్ ప్రాజెక్ట్ లో హీరోయిన్ ఎవరు అనేది ఇప్పుడు వరకు అఫీషియల్ గా అయితే బయటకి రాలేదు. కానీ అనధికారికంగా మాత్రం కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ అనే టాక్ ఉంది. మరి అసలు హీరోయిన్ ఎవరు ఆమేనా కాదా అనేది ఇపుడు లీక్ అయ్యింది.
రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ సినిమా మదరాసి తెలుగు ప్రీరిలీజ్ ఈవెంట్ లో నిర్మాత ఎన్ వి ప్రసాద్ మాట్లాడుతూ రుక్మిణి వసంత్ చేస్తున్న నెక్స్ట్ చిత్రాల్లో ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ కూడా ఉందని రివీల్ చేశారు. దీనితో ఈ భారీ ప్రాజెక్ట్ కాంబినేషన్ లో హీరోయిన్ గా రుక్మిణినే అని ఖరారు అయ్యిపోయింది. ఇక మేకర్స్ నుంచి ఒక్క అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉంది.