‘క్రాక్’ సినిమాకు రీషూట్ జరుగుతోందా ?


ఈ ఏడాది ఆరంభంలో ‘డిస్కో రాజ’తో పలకరించిన రవితేజ చేస్తున్న కొత్త చిత్రం ‘క్రాక్’. గోపిచంద్ మలినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. లాక్ డౌన్ ముందే సగం షూటింగ్ పూర్తికాగా ఈమధ్యే తిరిగి చిత్రీకరణ స్టార్ట్ చేశారు టీమ్. ఇప్పటికే ఆలస్యం కావడంతో వేగంగా షూటింగ్ కానిచ్చారు. దీంతో సినిమా ఎలా వచ్చిందో రషెస్ చూసుకున్నారట రవితేజ. అంతా బాగానే ఉన్నా కొన్ని సన్నివేశాలు అంత సంతృప్తికరంగా అనిపించలేదట ఆయనకు. అందుకే వాటిని రీషూట్ చేయాలని సూచించారట.

ప్రస్తుతం ఆ సన్నివేశాల రీషూట్ ఒంగోలులో జరుగుతున్నట్టు తెలుస్తోంది. రవితేజ బోలెడు ఆశలుపెట్టుకున్న ‘డిస్కో రాజా’ ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఈ సినిమాతో సాలిడ్ హిట్ అందుకోవాలని చూస్తున్నారు. అందుకే ఎక్కడా చిన్న పొరపాటు కూడ లేకుండా మొత్తం సినిమా ముందుగా అనుకున్న రీతిలో వచ్చేలా చూసుకుంటున్నారు. కాబట్టే ఈ రీషూట్ ప్రాసెస్ స్టార్ట్ చేసి ఉండవచ్చు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో శృతిహాస‌న్ హీరోయిన్‌గా నటించనుండగా సముథిరఖని, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మునుపు రవితేజ, గోపిచంద్ మలినేనిల కలయికలో ‘బలుపు, డాన్ శీను’ లాంటి మాస్ ఎంటెర్టైనర్లు వచ్చి ఉండటంతో ఈసారి కూడా అలాంటి సినిమానే ఆశిస్తున్నారు ప్రేక్షకులు.

Exit mobile version