బహు భాషా చిత్రాన్ని చెయ్యనున్న కోడి రామకృష్ణ


దాదాపుగా మూడు సంవత్సరాల విరామం తరువాత కోడి రామ కృష్ణ తిరిగి తెలుగులో చిత్రం చెయ్యనున్నారు. ఇన్నిరోజులు కన్నడంలో అయన మొదటి చిత్రం కోసం పని చేస్తున్నారని చాలామందికి తెలిసిన విషయమే. తెలుగులో “అరుంధతి” చిత్రానికి దర్శకత్వం వహించిన ఈ దర్శకుడు తరువాత కొద్దిరోజులు పుట్టపర్తి సాయిబాబా జీవితం మీద పరిశోధన చేశారు కాని ఆ చిత్రం మొదలు కాలేదు. ప్రస్తుతం ఆయన ఒక బహుభాషా చిత్రాన్ని చెయ్యాలని ఆలోచనలో ఉన్నారు. ఈ చిత్రం దక్షణ భారతదేశంలోని నాలుగు భాషలలోనూ తెరకెక్కనుంది. ఈ చిత్రం ఒక జంట మరియు వాళ్ళ పిల్లాడి మధ్య సాగే చిత్రంగా ఉండనుంది. ఇప్పటికే ఈ చిత్రంలో పాత్రల కోసం ఆయన లక్ష్మి రాయి, సోను సూద్ మరియు అర్జున్ సర్జలను ఎంపిక చేసుకున్నారు. సోను సూద్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించనున్నారు. ఈ చిత్రం గురించిన మరిన్ని విశేషాలు త్వరలో వెల్లడిస్తారు. ఈ చిత్రాన్ని కనుక నాలుగు భాషల్లో విడుదల చెయ్యగలిగితే ఇలా చెయ్యగలిగిన మొదటి తెలుగు దర్శకుడు అవుతారు.

Exit mobile version