శర్వానంద్ మరియు ప్రియ ఆనంద్ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న “కో అంటే కోటి” చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. ప్రధాన పాత్రల మీద ఒక పాటను తెరకెక్కిస్తున్నారు. ” ఈరోజు చేసిన పాట నన్ను వదలటం లేదు అనీష్ కురువిల్ల ఈ పాటను చాల బాగా చిత్రీకరిస్తున్నారు” అని ప్రియ ఆనంద్ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. గతనెల ఈ చిత్ర బృందం రాజమండ్రిలో కీలక సన్నివేశాలను తెరకెక్కించింది. ఈ చిత్రంలో టాకీ భాగం దాదాపుగా పూర్తయిపోయింది. “అవకాయ్ బిర్యాని” చిత్రానికి దర్శకత్వం వహించిన అనీష్ కురువిల్ల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శర్వా ఆర్ట్స్ బ్యానర్ మీద శర్వానంద్ స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కాకుండా శర్వానంద్, చేరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ద్విభాషా చిత్రంలో నటించనున్నారు ఈ చిత్రంలో శర్వానంద్ సరసన నిత్యమీనన్ నటించనుంది.