కిరణ్ అబ్బవరం నెక్స్ట్ పాన్ ఇండియా హీరో!

మన టాలీవుడ్ లో ఉన్నటువంటి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో యువ హీరో కిరణ్ అబ్బవరం కూడా ఒకరు. తన నెక్స్ట్ చిత్రం “కే ర్యాంప్” రేపు దీపావళి కానుకగా థియేటర్స్ లో ట్రీట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉండగా ఈ సినిమా ప్రమోషన్స్ ని ఫుల్ స్వింగ్ లో తాను చేస్తున్నాడు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో సీనియర్ నటుడు నరేష్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

తాను కిరణ్ అబ్బవరం నెక్స్ట్ పాన్ ఇండియా హీరో అంటూ కామెంట్స్ చేశారు. మహేష్ బాబు, అల్లు అర్జున్, అలాగే నానిలు తర్వాత కిరణ్ అబ్బవరం అని ప్రశంసలు కురిపించారు. తాను చాలా ఎక్కువ చెప్పానని కాదు ఒక హీరోలో నటుడు ఉండాలి చాలా తక్కువమందిలో కిరణ్ ఒకడని తెలిపారు. డెఫినెట్ గా తాను పాన్ ఇండియా మార్కెట్ లోకి వెళ్తాడని ఆశిస్తున్నట్టుగా తాను తెలిపారు. దీనితో తన కామెంట్స్ వైరల్ గా మారాయి.

Exit mobile version