దీపావళి రిలీజ్‌లు.. కిరణ్ అబ్బవరం ‘ర్యాంప్’ ఆడిస్తాడా..?

Diwali Releses

దీపావళి పండుగ సీజన్‌ను క్యాష్ చేసుకునేందుకు పలు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటికే ఈ దీపావళి బరిలో మూడు తెలుగు సినిమాలతో పాటు ఓ తమిళ డబ్బింగ్ సినిమా తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వచ్చాయి. వీటిలో అందరికంటే ముందుగా ‘మిత్ర మండలి’ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాలో ప్రియదర్శి, నిహారిక ఎన్ఎం, విష్ణు ఓఇ, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా ముఖ్య పాత్రల్లో నటించారు. అయితే, ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.

ఇక సిద్ధు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి ముఖ్య పాత్రల్లో నటించిన ‘తెలుసు కదా’, తమిళ నటుడు ప్రదీప్ రంగనాథన్ ‘డ్యూడ్’ చిత్రాలు నేడు వరల్డ్‌వైడ్ రిలీజ్ అయ్యాయి. ఈ సినిమాల్లో ‘తెలుసు కదా’కు డీసెంట్ టాక్ రాగా, ‘డ్యూడ్’ చిత్రానికి కాస్త ఎక్కువ మార్కులు పడ్డాయి. ఇక దీంతో ఇప్పుడు దీపావళి బరిలో మిగిలి ఉన్న ‘కె-ర్యాంప్’ చిత్రంపైనే అందరి కళ్లు ఉన్నాయి.

ఈ సినిమాతో కిరణ్ అబ్బవరం నిజంగానే బాక్సాఫీస్ దగ్గర ర్యాంప్ ఆడిస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఒకవేళ ఈ సినిమాకు గనక బెటర్ టాక్ వస్తే, ఈ దీపావళి బరిలో విజేతగా ‘కె-ర్యాంప్’ నిలిచే అవకాశం ఉంది. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే మరికొద్ది గంటలు వెయిట్ చేయాల్సిందే.

Exit mobile version