బాలీవుడ్ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రమే “రామాయణ”. బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కిస్తున్న ఈ భారీ విజువల్ వండర్ పై మంచి అంచనాలు ఉన్నాయి. ఆ మధ్య వచ్చిన గ్లింప్స్ తోనే సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమా గ్లోబల్ గా కూడా ఆకట్టుకుంటుంది అని అంతా నమ్ముతున్నారు.
అయితే ఓ క్రేజీ బజ్ ఈ సినిమాపై ఇప్పుడు వినిపిస్తుంది. దీని ప్రకారం రామాయణ ట్రైలర్ కి ఆల్రెడీ ముహూర్తం ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. అందుకోసం మేకర్స్ గ్లోబల్ వేదిక ఎంచుకున్నారట. ప్రముఖ హాలీవుడ్ ఈవెంట్ కామిక్ కాన్ ఈవెంట్ లో వచ్చే ఏడాది జూలై లో ఈ ట్రైలర్ ని లాంచ్ చేయనున్నట్టుగా ఇపుడు వినిపిస్తుంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో యష్, సన్నీ డియోల్, కాజల్ అగర్వాల్ తదితరులు కూడా నటిస్తున్నారు.