ఆ డైరెక్టర్‌తో నితిన్ మంతనాలు.. కథ ఓకే అయ్యేనా..?

హీరో నితిన్ ఇటీవల నటించిన ‘రాబిన్‌హుడ్’, ‘తమ్ముడు’ సినిమాలు భారీ నిరాశను మిగిల్చాయి. దీంతో వరుస ఫెయిల్యూర్స్ తర్వాత ఆయన తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు.

తొలుత వేణు యెల్దండితో ‘ఎల్లమ్మ’ చిత్రం చేయాలని భావించాడు. ఆ తర్వాత విక్రమ్ కె. కుమార్‌తో స్పోర్ట్స్ డ్రామా చేయాలని అనుకున్నా, ఇప్పుడు వాటినుంచి తప్పుకున్నట్టు సమాచారం. ఇదే సమయంలో ‘లిటిల్ హార్ట్స్’ దర్శకుడు సాయి మార్తాండ్ నితిన్‌కు ఒక లవ్ స్టోరీ వినిపించాడట.

కానీ, నితిన్ వీరెవరికీ కూడా ఓకే చెప్పలేదట. ఇక ఇప్పుడు దర్శకుడు విఐ ఆనంద్‌తో నితిన్ కథా చర్చల్లో ఉన్నాడు. అలాగే శ్రీను వైట్ల కూడా అతడిని కలిసారని టాక్. అయితే ఇప్పటివరకు నితిన్ ఏ ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. మరి నితిన్ ఎవరికి తన నెక్స్ట్ చిత్రం బాధ్యతలు అప్పగిస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది.

Exit mobile version