ప్రస్తుతం మన టాలీవుడ్ సినిమా దగ్గర రిలీజ్ కి వచ్చి దూసుకెళ్తున్న చిత్రం “హరిహర వీరమల్లు”. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ చిత్రం సాలిడ్ ప్రీమియర్స్ కూడా వేసుకొని ఫ్యాన్స్ కి ట్రీట్ ఇచ్చింది. అయితే మేకర్స్ ఈ సినిమాపై గట్టి నమ్మకంతో భారీ ఎత్తున ముందు రోజే ఇండియా వైడ్ ప్రీమియర్స్ వేశారు. దీనికి సెన్సేషనల్ రెస్పాన్స్ రాగా ఇప్పుడు ఇదే బాటలో మరో భారీ సినిమా ముందే ప్రీమియర్స్ తో రాబోతుందట.
మరి ఆ చిత్రమే “కింగ్డమ్”. సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు ఉండగా మేకర్స్ దీనికి కూడా గ్రాండ్ పైడ్ ప్రీమియర్స్ ని ప్లాన్ చేస్తున్నారట. ఇక దీనికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. ఇక ఈ చిత్రంకి అనిరుద్ సంగీతం అందిస్తుండగా ఈ జూలై 31న పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది.