రొమాన్స్ చిత్రాల రారాజు యశ్ చోప్రా ఇకలేరు

రొమాన్స్ చిత్రాల రారాజు యశ్ చోప్రా ఇకలేరు

Published on Oct 21, 2012 7:08 PM IST


భారతీయ రొమాంటిక్ చిత్రాలకు రారాజు యశ్ చోప్రా కొద్దిసేపటి క్రితం తుది శ్వాస విడిచారు. ఈయన డెంగీ భారిన పడి కొద్ది రోజుల క్రితం లీలావతి హాస్పిటల్ చేరారు. అదే హాస్పిటల్ లో తుది శ్వాస విడిచారు. అయన చివరగా షారుఖ్ ఖాన్ ప్రధాన పాత్రలో దర్శకత్వం వహించిన చిత్రం “జబ్ తక్ హాయ్ జాన్” విడుదల కావలసి ఉంది. భారతీయ చలనచిత్ర రంగంలో 50 వసంతాల సేవ చేసిన వారిలో యశ్ చోప్రా ఒక్కరు. అయన దర్శకత్వం వహించిన కొన్నిఆణిముత్యాలు “డర్ర్”,”దిల్వాలే దుల్హనియా లేజాయెంగే”,”వీర్ జార”,”చాందిని” ,” లమ్హే” మరియు “దిల్ తో పగల హాయ్” చిత్రాలే కాకుండా చాలా ఉన్నాయి. యశ్ చోప్రా మరణానికి 123తెలుగు తీవ్ర సంతాపం తెలియచేస్తుంది.

తాజా వార్తలు