“బిగ్ బాస్ 4″ను ఒంటి చేత్తో లాగేస్తున్న నాగ్.?

స్మాల్ స్క్రీన్ పై కింగ్ ఆల్వేస్ కింగ్ అనిపించారు నాగార్జున. తాను మొట్టమొదటిగా చేసిన “మీలో ఎవరు కోటీశ్వరుడు” నుంచి లేటెస్ట్ “బిగ్ బాస్” లేటెస్ట్ బిగ్ బాస్ వరకు తనదైన శైలిలో రక్తి కట్టిస్తూ ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు. అయితే ఎంత పెద్ద ష్ అయినప్పటికీ సరైన హోస్ట్ లేకపోతే అది చప్పగానే ఉంటుంది.

కానీ అన్ని రకాల రుచులతోను కింగ్ నాగార్జున అందిస్తున్న ఎంటర్టైన్మెంట్ బిగ్ బాస్ 4 షోను మరో లెవెల్ కు తీసుకెళ్లింది అని చెప్పాలి. ఈ గ్రాండ్ రియాలిటీ షో మూదలయ్యి ఇప్పటికే మూడు వారాలు కావస్తుంది. అయితే ప్రతీ వీకెండ్స్ లో హోస్ట్ గా నాగ్ వస్తారన్న సంగతి తెలిసిందే.

అలా నాగ్ హోస్ట్ చేసిన గత సెప్టెంబర్ 19 మరియు 20 వ తారీఖులు ఎపిసోడ్స్ కు గట్టి టీఆర్పీనే వచ్చినట్టు తెలుస్తుంది. శనివారం ఎపిసోడ్ కు గాను 9.6 టీఆర్పీ రాగా ఆదివారం ఎపిసోడ్ కు మాత్రం 13కి పైగా టీఆర్పీ వచ్చినట్టు తెలుస్తుంది. దీనితో వీకెండ్స్ లో నాగ్ ఎలాంటి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారో చూడొచ్చు.

పైగా ఇదే వీకెండ్స్ లో సస్పెన్సఫుల్ గా ఎలిమినేషన్స్ ఉండటం మరింత ప్లస్ అయ్యింది. మరి ఇలాంటి షోను అద్భుతంగా నాగ్ హోస్ట్ చేసి ఒంటి చేత్తో రక్తి కట్టించడం మూలానే ఇదంతా అని చెప్పాలి.

Exit mobile version