గుడ్ న్యూస్: కేజీఎఫ్ చాప్టర్ 2 బ్యాలన్స్ షూటింగ్ స్టార్ట్ అయ్యేది అప్పుడే!

గుడ్ న్యూస్: కేజీఎఫ్ చాప్టర్ 2 బ్యాలన్స్ షూటింగ్ స్టార్ట్ అయ్యేది అప్పుడే!

Published on Aug 22, 2020 3:00 AM IST


రాకింగ్ స్టార్ యష్ హీరోగా, కైకాల సత్నారాయణ సమర్పణలో హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్రం పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కన్నడ చలనచిత్ర చరిత్రలోనే కేజీఎఫ్ చిత్రం భారీ విజయం సాధించడంతో కేజీఎఫ్ చాప్టర్ 2 ను ఇంకా భారీగా నిర్మిస్తున్నారు దర్శక నిర్మాతలు. మొదటి పార్ట్ ను పాన్ ఇండియా చిత్రం గా కన్నడ,తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయగా, అదే తరహాలో కేజీఎఫ్ చాప్టర్ 2 ను సిద్దం చేస్తున్నారు.

అయితే తాజా సమాచారం ప్రకారం ఆగస్ట్ 26 నుండి ఈ చిత్ర షూటింగ్ మళ్లీ ప్రారంభం కానుంది. బ్యాలన్స్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది, ఎప్పుడు పూర్తి అవుతుంది అని ఎదురు చూసే అభిమానులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. బెంగళూరు లోని కంఠీరవ స్టూడియో లో ఆగస్ట్ 26 న షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ లో ఒక్క క్లైమాక్స్ ఫైట్ మినహా మిగతా సినిమా షూటింగ్ మొత్తం పది రోజుల్లో పూర్తి చేయనున్నట్లు సమాచారం. ఈ చిత్రం లో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా, రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు