దర్శకుడు అజయ్ భూపతి ‘మహా సముద్రం’ అనే సినిమా చేయడానికి ఎప్పటినుండో సన్నాహాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రవితేజతో పాటు నాగచైతన్య కూడా ఈ సినిమా నుండి తప్పుకోవడంతో.. అజేయ్, హీరో శర్వానంద్ తో ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నాడు. అలాగే మరో హీరో పాత్రలో సిద్ధార్థ్ గాని, తమిళ హీరో అథర్వా గాని నటించే అవకాశం ఉందంటూ ఇప్పటికే వార్తలు వచ్చాయి.
కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాలో సెకెండ్ హీరో పాత్రలో యంగ్ హీరో కార్తికేయ నటిస్తారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అజయ్ భూపతి స్పందించాల్సిందే. ఈ సినిమాలో శర్వానంద్ కి జతగా క్రేజీ హీరోయిన్ సాయిపల్లవి నటించబోతుందట. అజయ్ ఇప్పటికే సాయిపల్లవికి కథ కూడా వివరించారట. సాయి పల్లవి కూడా సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.
ఇక కరోనా హడావుడి ముగిసాక ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్ళనున్నారు. ఈ సినిమా పక్కా ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా ఉంటుందని.. సినిమాలో సెకెండ్ హీరో పాత్ర చనిపోతుందని.. అలాగే స్టోరీ వరల్డ్ కూడా కాస్త కొత్తగా ఉంటుందని సమాచారం.